అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించడం లేదు ?
కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఒక సంవత్సరానికి సుమారుగా 30 లక్షల కోట్లు లేదా 30 శంఖులు (ఒక శంఖు शङ्कु అంటే 1 లక్ష కోట్లు. 10 పవర్ 12). ఖర్చు 33 లక్షల కోట్లు లేదా శంఖులు (10% fiscal deficit లేదా లోటు బడ్జెట్ మనది). పెట్రోలియం మీద కేంద్రానికి 3 శంఖుల ఆదాయం సంవత్సరానికి. 6 శంఖులు కార్పోరేట్ ఆదాయ పన్నులు, 6 శంఖులు వ్యక్తిగత ఆదాయ పన్నులు, 7 శంఖుల GST, 1.5 శంఖులు కస్టమ్స్, మిగతావి అప్పులు, ఇతరత్రా ఆదాయం. మొత్తం సుమారుగా 30 శంఖులు. పెట్రోలియం మీద సుంకాలు తగ్గించాలంటే… మనకు 30 శంఖుల ఆదాయం. 35 శంఖుల ఖర్చులు. ఒకటి ఆదాయం పెంచుకోవాలి లేదా ఖర్చులు తగ్గించుకోవాలి. కేంద్ర ఉద్యోగాలలో కోతలు పెట్టాలి, సబ్సిడీలు తగ్గించాలి, రైతులు MSP లు తీసివేయాలి, విద్య, వైద్యం, రోడ్లు, నీళ్ళు లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో కోత పెట్టాలి. కార్పోరేట్ ఆదాయ పన్నులు - ఇక్కడ పన్నులను పెంచితే, లాభాలు పడిపోయి, కంపెనీలు పారిపోతాయు లేదా ఉద్యోగాలు తొలగిస్తాయి. వ్యక్తిగత ఆదాయ పన్నులు - నూటికి కట్టేదే ఐదుగురు. 5%. వీళ్ళనే మళ్ళా ఏం పిండుతాం ? మధ్య తరగతి పాపం. లేదా GST పెంచాలి. ఉప్పు మీద, పప్పు మీద పన్ను వేసారు అన...