Skip to main content

అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించడం లేదు ?

 


కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఒక సంవత్సరానికి సుమారుగా 30 లక్షల కోట్లు లేదా 30 శంఖులు (ఒక శంఖు शङ्कु అంటే 1 లక్ష కోట్లు. 10 పవర్ 12). ఖర్చు 33 లక్షల కోట్లు లేదా శంఖులు (10% fiscal deficit లేదా లోటు బడ్జెట్ మనది).

పెట్రోలియం మీద కేంద్రానికి 3 శంఖుల ఆదాయం సంవత్సరానికి. 6 శంఖులు కార్పోరేట్ ఆదాయ పన్నులు, 6 శంఖులు వ్యక్తిగత ఆదాయ పన్నులు, 7 శంఖుల GST, 1.5 శంఖులు కస్టమ్స్, మిగతావి అప్పులు, ఇతరత్రా ఆదాయం. మొత్తం సుమారుగా 30 శంఖులు.

పెట్రోలియం మీద సుంకాలు తగ్గించాలంటే…

మనకు 30 శంఖుల ఆదాయం. 35 శంఖుల ఖర్చులు. ఒకటి ఆదాయం పెంచుకోవాలి లేదా ఖర్చులు తగ్గించుకోవాలి.

కేంద్ర ఉద్యోగాలలో కోతలు పెట్టాలి, సబ్సిడీలు తగ్గించాలి, రైతులు MSP లు తీసివేయాలి, విద్య, వైద్యం, రోడ్లు, నీళ్ళు లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో కోత పెట్టాలి.

కార్పోరేట్ ఆదాయ పన్నులు - ఇక్కడ పన్నులను పెంచితే, లాభాలు పడిపోయి, కంపెనీలు పారిపోతాయు లేదా ఉద్యోగాలు తొలగిస్తాయి.

వ్యక్తిగత ఆదాయ పన్నులు - నూటికి కట్టేదే ఐదుగురు. 5%. వీళ్ళనే మళ్ళా ఏం పిండుతాం ? మధ్య తరగతి పాపం.

లేదా GST పెంచాలి. ఉప్పు మీద, పప్పు మీద పన్ను వేసారు అని రచ్చ రంభోళా చేస్తారు. శానిటరీ నాప్కిన్ ల మీద పన్ను ఉంటే గొడవ గొడవ చేసి దాన్ని సున్నా GST కి తెచ్చేదాక నిద్రపోలేదు మనోళ్ళు.

సబ్సీడులు ఇవ్వాలి, రైతులకు MSP ఇవ్వాలి, బీదలకు రూపాయకు బియ్యం ఇవ్వాలి. తగ్గిస్తాం అంటే ఢిల్లీలో రైతుల గొడవ చూడండి.

పోనీ నష్టాల్లో ఉన్న బ్యాంకులు, పరిశ్రమలు అమ్ముదాం అంటే ఒప్పుకోరు. విశాఖ ఉక్కు రగడ చూడండి.

మళ్ళా Expressways, Bullet Trains కావాలి. అభివృద్ధి కావాలి, అందమైన రోడ్లు కావాలి.

ఉచిత విద్యుత్ కావాలి, ఉచిత నీళ్ళు కావాలి. పన్నులు మాత్రం కట్టం, మా దేశం అమెరికాలా అందంగా తయారవ్వాలి ? ఎలా సాధ్యం?

పెట్రోలియం మీద పన్నులు

మన క్రూడ్ దిగుమతులు 85% ఉన్నాయి, ఇంధనంపై పన్నులను తగ్గించడం మంచి ఆలోచన కాదు.

1. ఒకవేళ ఆయిల్ చౌకగా ఉన్నట్లయితే, డిమాండ్ పెరుగుతుంది దాంతో మరింత ఆయిల్ ని దిగుమతి చేసుకోవాలి. దెబ్బకు మన ఫారెక్స్ డాలర్లను తినేలా చేస్తుంది.

2. అధిక చమురు ధరలు వినియోగాన్ని తగ్గిస్తాయి మరియు పర్యావరణాన్ని ఆదా చేస్తుంది. తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడతాయి.

3. అధిక పెట్రోలియం ధరలు పునరుత్పాదక ఇంధన వనరులలో పెట్టుబడి పెట్టడానికి మరింత అవకాశం కలిపిస్తాయి. ఎలక్ట్రిక్ కార్లు చౌకగా కనిపిస్తాయి. గ్యాసు, సోలార్ మీద పెట్టుబడులు పెరుగుతాయి.

పెట్రోలియం ఎంత భారం ప్రజలకు ?

రోజూ 50 కిలోమీటర్లు బండిమీద తిరిగితే ఒక లీటరు పెట్రోలు కావాలి. అంటే పది రూపాయలు ఎక్కువ అయింది. నెలకు 300 పెరిగింది. కారు ఉన్నవాళ్లకు 50 రూపాయలు (5 లీటర్లు )రోజుకు, 7 నుండి 20 లక్షల కారు కొన్నవాళ్ళుకు 1500 పెరిగింది. నా దృష్టిలో ఈమాత్రం ప్రజలు కట్టగలరు.

గత ప్రభుత్వాలు ఆయిల్ బాండులు (అప్పులు) జారీ చేసి, పెట్రోలు చవకగా ఇచ్చారు. మనం కాకపోతే మన పిల్లలు కట్టాలి అవి.

ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. మీకు ఏదైనా ఉచితంగా వచ్చింది అంటే, పాపం దానికి ఎవరో డబ్బు చెల్లించారు ఎక్కడో!

Comments

  1. దొరికాడు ఒక బీజేపీ అంధభక్తుడు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం

రాహుకాలం ,  వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం వారాల క్రమ పద్దతి మన శాస్త్రాల ప్రకారం మనకి మొత్తం నవగ్రహాలు ఉన్నాయి. మనవాళ్ళు చంద్ర, సూర్యలను కూడా గ్రహాల క్రిందే లెక్క కట్టారు. రాహూ, కేతు ఛాయాగ్రహాలు కావున వాటిని తీసివేస్తే మిగిలిన 7 గ్రహాల పేర్ల మీద మనకి 7 వారాలు వచ్చాయి. ఈ పేర్ల క్రమం ఎలా వచ్చిందో చూద్దాం . దీని వెనక ఉన్న తర్కం చూద్దాం 7 గ్రహాల క్రమం మనం ఒక పద్దతి ప్రకారం చూస్తే …. దూరం పరిమాణం గ్రహ భ్రమణ వేగం ఒక Astronomical Units (Au) అంటే భూమికి, సూర్యునికి మధ్య దూరం, 15,00,00,000 (15 కోట్లు) కిలోమీటర్లు. ఒక Lunar Distance (LD) అంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం, 3,85,000 (3 లక్షల, 85 వేల) కిలోమీటర్లు. క్ర . సం . గ్రహ - దూరం గ్రహ పరిమాణం గ్రహ భ్రమణ వేగం తెలుగు English చంద్ర సూర్య గ్రహం Kms భూమితో గ్రహం వేగం 1 చంద్ర Moon 1 O.oo25 చంద్ర 1,737 27% చంద్ర 27 రో 2 శుక్ర Venus 108 O.28 బుధ 2,440 38% బుధ 88 రో 3 మంగళ Mars 202 O.52 మంగళ ...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత వరకు సమంజసం ? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ను ప్రైవేట్ పరం చేస్తుందా ?

విశాఖ స్టీల్ ను ప్రైవేటు చేయడానికి మోడీ ప్రభుత్వ ప్రయత్నం. దీనిని మనమందరం ఓపెన్ హార్ట్ తో స్వాగతం పలకాలి, ఎందుకంటే ఇది చాలా మంచి చర్య. ఎందుకంటే ముందర ఒక సాధారణ ప్రభుత్వ సంస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం ? సంస్ధ యజమాని ఎవరు? సంబంధిత మంత్రి. ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఎవరు కంపెనీ నడుపుతున్నారు ? కొందరు ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు.వీళ్ళకు వ్యాపారనుభవం సున్న. ఇక ప్రభుత్వ ఉద్యోగులు: ఉద్యోగం పోతుందనే భయం లేదు, కంపెనీకి నష్టాలొచ్చినా వీళ్ళ జీతాలకు ఢోకాలేదు. పదవీవిరమణ వరకు జీతం గారెంటీ, ఒక్కసారి ఉద్యోగం తెచ్చుకుంటే పని చేసినా చేయకపోయినా జీవితాంతం జీతం. కంపెనీకి నష్టాలు వస్తే డబ్బు ఎవరు చెల్లిస్తారు? మన పన్నుల నుండే.ప్రజలు కష్టం నుండి. ఒక మంత్రి, కొద్దిమంది ఐఏఎస్ లు మరియు కొంతమంది అదృష్టవంతమైన ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుంది? మనలో చాలామందికి తెలుసు. ఎలా గవర్నమెంట్ జాబ్ పొందాలో, ఎంత ఖర్చు అవుతుందో, అవినీతికి మూలస్తంభం) పైన ఉదహరించిన వాళ్ళలో ఎవరైనా కంపెనీలో సింగిల్ పైసా పెట్టుబడి పెట్టారా ? ప్రజల పన్నుల డబ్బు మాత్రమే ఉంది అక్కడ. ఒకవేళ నష్టం వస్తే మంత్రి, మేనేజ్ మెంట్ లేదా ఉద్యోగులకు ఏమై...

భారతదేశం ఎందుకు వెనుకబడింది ?

సామ్యవాదం అసలైన కారణం మనకి స్వాతంత్ర్యం వచ్చాక సామ్యవాదాన్ని (socialism) అనుసరించటం. ప్రపంచంలో సామ్యవాదాన్ని అనుసరించి బాగుపడిన దేశం ఒక్కటి కూడా లేదు. మనం ఉత్తర కొరియా, దక్షిణ కొరియూ లని తీసుకంటే దక్షిణ కొరియా స్వేచ్చా వాణిజ్యం (free market economy) విధానాన్ని అనుసరించి అధ్భుత ప్రగతి సాధించింది, ఉత్తర కొరియా సామ్యవాదాన్ని అనుసరించి బీదరికంలోకి జారిపోయింది. ఇంకా తూర్పు జర్మని, పశ్చిమ జర్మని లని తీసుకుంటే పశ్చిమ జర్మని స్వేచ్చా వాణిజ్యంతో ఉన్నత స్థితికి వెళితే, తూర్పు జర్మని సామ్యవాదంతో సర్వనాశనం అయిపోయింది. అణుబాంబులతో సర్వనాశనం అయిన జపాన్ 50 ఏళ్ళలో ధనికదేశం అయిపోయింది. వీళ్ళు కూడా స్వేచ్చా వాణిజ్య విధానంలో పైకి వచ్చారు. ప్రస్తుతానికి వస్తే వెనిజులా దగ్గర అధ్భుతమైన ఆయిల్ నిక్షేపాలు ఉన్నా సామ్యవాదాన్ని నమ్ముకొని ఎంత ఘోరంగా నాశనం అయిపోయందో మనం చూడొచ్చు. సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలు, చైనా (1978 వరకు) ఆర్ధికంగా దిగజారిపోయాయి ఈ సామ్యవాద మత్తులో పడి. మొత్తానికి ఆర్ధిక స్వేచ్చ లేని, సామ్యవాదాన్ని మాత్రమే నమ్ముకొని బాగుపడిన దేశం కానీ, సమాజం కానీ, ఒక జాతి కానీ లేవు ఈ భూమ్మీద. మన భారతదేశా...