వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత వరకు సమంజసం ? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ను ప్రైవేట్ పరం చేస్తుందా ?
విశాఖ స్టీల్ ను ప్రైవేటు చేయడానికి మోడీ ప్రభుత్వ ప్రయత్నం.
దీనిని మనమందరం ఓపెన్ హార్ట్ తో స్వాగతం పలకాలి, ఎందుకంటే ఇది చాలా మంచి చర్య.
ఎందుకంటే ముందర ఒక సాధారణ ప్రభుత్వ సంస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం ?
సంస్ధ యజమాని ఎవరు? సంబంధిత మంత్రి. ఆయన ఒక రాజకీయ నాయకుడు.
ఎవరు కంపెనీ నడుపుతున్నారు ? కొందరు ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు.వీళ్ళకు వ్యాపారనుభవం సున్న.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు: ఉద్యోగం పోతుందనే భయం లేదు, కంపెనీకి నష్టాలొచ్చినా వీళ్ళ జీతాలకు ఢోకాలేదు. పదవీవిరమణ వరకు జీతం గారెంటీ, ఒక్కసారి ఉద్యోగం తెచ్చుకుంటే పని చేసినా చేయకపోయినా జీవితాంతం జీతం.
కంపెనీకి నష్టాలు వస్తే డబ్బు ఎవరు చెల్లిస్తారు? మన పన్నుల నుండే.ప్రజలు కష్టం నుండి.
ఒక మంత్రి, కొద్దిమంది ఐఏఎస్ లు మరియు కొంతమంది అదృష్టవంతమైన ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుంది? మనలో చాలామందికి తెలుసు. ఎలా గవర్నమెంట్ జాబ్ పొందాలో, ఎంత ఖర్చు అవుతుందో, అవినీతికి మూలస్తంభం)
పైన ఉదహరించిన వాళ్ళలో ఎవరైనా కంపెనీలో సింగిల్ పైసా పెట్టుబడి పెట్టారా ? ప్రజల పన్నుల డబ్బు మాత్రమే ఉంది అక్కడ. ఒకవేళ నష్టం వస్తే మంత్రి, మేనేజ్ మెంట్ లేదా ఉద్యోగులకు ఏమైనా నష్టం జరుగుతుందా? పిసరంత నష్టం కూడా లేదు. నష్టాలొచ్చినా ప్రమోషన్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్లు, నెలవారీ జీతాలకు ఢోకానే లేదు.
మంత్రి ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకొని కావలసినంత అవినీతి చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. తన కు కావలసిన వాళ్ళకి లేదా లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వవచ్చు. ఇంకా స్నేహితులకు కాంట్రాక్ట్ లు మరియు కమిషన్ లు పొందుతారు. సంస్ధ ఒక కామధేనువు.
ఈ అదృష్టవంతులు అందరూ కేవలం ప్రభుత్వ సంస్ధ పేరు మీద సామాన్యుల రక్తాన్ని పన్నుల పేరుతో పీల్చి పిప్పి చేసి ఆనందిస్తున్నారు. ఎవరికీ భాద్యత లేదు, భయం లేదు.
పరిష్కారం:
ఈ చెత్తంతా ప్రైవేటైజేషన్ ద్వారా శుభ్రం చేయబడుతుంది. ఇప్పడు ప్రైవేటు వ్యక్తులు తమ స్వంత డబ్బును పెట్టుబడి పెడతారు మరియు
కంపెనీ రన్ చేస్తారు. నష్టాలకు ఇప్పుడు యాజమాన్యం బాధ్యత వహిస్తుంది, ఉద్యోగులు తమ భవిష్యత్తు గురించి భయపడుతారు. పని చేస్తారు. యజమానులు దానిని లాభదాయకంగా చేయడానికి ప్రయత్నిస్తారు, లేనిపక్షంలో వారి పెట్టుబడులు పోతాయి.
ప్రజలకు ఏ వ్యవస్థ కావాలి?
ఎలాంటి జవాబుదారీతనం, బాధ్యత లేకుండా కంపెనీ పబ్లిక్ డబ్బుతో రిస్క్ లేకుండా నడపటమా? లేదా
స్వంత డబ్బుతో రిస్క్ తీసుకోని నడపటమా ?
భారత ప్రజలైన మనకి ఏం కావాలో నిర్ణయం తీసుకోవాలి ఇప్పడు. పన్నులతో కంపెనీలా? రోడ్డు, నీళ్ళు, విద్య, వైద్యమా ?
ప్రభుత్వ ధర్మం, వ్యాపారాలు చేయడం కాదు. పరిపాలన చేయడం.
వ్యాపారాలు, స్వంత డబ్బుతో, భాగస్వాముల ద్వారా చేయాలి.
వైజాగ్ స్టీల్ ప్రైవేట్ మేనేజ్ మెంట్ కు వెళ్లి అద్భుతమైన, సూపర్ కంపెనీగా తీర్చిదిద్దుతుంది.
వీరు ఖచ్చితంగా బద్ధక, అవినీతి ఉద్యోగులను మరియు నిరుపయోగమైన మేనేజ్ మెంట్ ని తోలు వలిచి పని చేపించి లాభాల్లోకి తీసుకుని వస్తారు.
ప్రైవేటీకరణ కు సంబంధించిన ఈ చర్యకు భారత పౌరులు మద్దతు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం బహిరంగ వేలంలో వెళుతుంది, కాబట్టి అమ్మడంలో అవినీతి కి గురి కాదు. ఎవరైనా వేలంలో పాల్గొని డబ్బు ఉంటే కంపెనీని కొనుగోలు చేయవచ్చు.
మోదీ ఆద్వర్యంలోని కేంద్రప్రభుత్వం అవినీతిరహిత ప్రభుత్వం. పారదర్శకంగా అమ్ముతారు. వచ్చిన డబ్బుతో చాలా సులభంగా వైజాగ్ కు మెట్రో లాంటి ప్రజోపయుగమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు.
——-
భారత ప్రభుత్వ మెడమీద 250+ కంపెనీలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం చక్కగా చెప్పింది. 24 మాత్రం ఉంచి మిగతావిఅన్నీ వదిలించుకుంటామని. కావున ఒకటి ముందర ఒకటి వెనక అవ్వచ్చేమో కానీ అన్నిటికి మంగళం పాడటం గారెంటీ.
పరిపాలన మాత్రమే ప్రభుత్వ విధి. వ్యాపారం ప్రైవేటువాళ్ల విధి. సేవ రాజకీయవిధి.
We want Minimum Government Maximum Goveranance.
ఈ కంపనీల దరిద్రం పోతే, కేంద్రంలో సగం మంత్రిత్వశాఖలు మూతపడి, రాజకీయం లాభదాయకం కాక రాజకీయ అవినీతి కూడా తగ్గిపోతుంది. వ్యాపార దృక్పథం ఉన్న రాజకీయనాయకులు వ్యాపారాలు చేసుకుంటారు. సేవా దృక్పథం ఉన్నోళ్లు మాత్రం రాజకీయాల్లో మిగులుతారు. దేశానికి శుభపరిణామం.
జైహింద్
లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు ప్రవేటికరణ చేస్తున్నారు ఇది అభివృద్ధి కోసం కాదు కేవలం కొంత మంది కార్పొరేట్ సంస్థలకు కారుచావు గా అమ్మేసి మరల వారికే మాఫీ చేస్తున్నారు ఇది BJP చేస్తున్న పెద్ద కుంభకోణం
ReplyDelete