రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం
వారాల క్రమ పద్దతి
మన శాస్త్రాల ప్రకారం మనకి మొత్తం నవగ్రహాలు ఉన్నాయి. మనవాళ్ళు చంద్ర, సూర్యలను కూడా గ్రహాల క్రిందే లెక్క కట్టారు. రాహూ, కేతు ఛాయాగ్రహాలు కావున వాటిని తీసివేస్తే మిగిలిన 7 గ్రహాల పేర్ల మీద మనకి 7 వారాలు వచ్చాయి.
ఈ పేర్ల క్రమం ఎలా వచ్చిందో చూద్దాం. దీని వెనక ఉన్న తర్కం చూద్దాం
7 గ్రహాల క్రమం మనం ఒక పద్దతి ప్రకారం చూస్తే ….
- దూరం
- పరిమాణం
- గ్రహ భ్రమణ వేగం
ఒక Astronomical Units (Au) అంటే భూమికి, సూర్యునికి మధ్య దూరం, 15,00,00,000 (15 కోట్లు) కిలోమీటర్లు. ఒక Lunar Distance (LD) అంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం, 3,85,000 (3 లక్షల, 85 వేల) కిలోమీటర్లు.
క్ర.సం. |
గ్రహ-దూరం |
గ్రహ పరిమాణం |
గ్రహ భ్రమణ వేగం |
||||||
|
తెలుగు |
English |
చంద్ర |
సూర్య |
గ్రహం |
Kms |
భూమితో |
గ్రహం |
వేగం |
1 |
చంద్ర |
Moon |
1 |
O.oo25 |
చంద్ర |
1,737 |
27% |
చంద్ర |
27 రో |
2 |
శుక్ర |
Venus |
108 |
O.28 |
బుధ |
2,440 |
38% |
బుధ |
88 రో |
3 |
మంగళ |
Mars |
202 |
O.52 |
మంగళ |
3,390 |
53% |
శుక్ర |
224 రో |
4 |
బుధ |
Mercury |
237 |
O.61 |
శుక్ర |
6,052 |
95% |
సూర్య |
1 సం. |
5 |
సూర్య |
Sun |
389 |
1 |
శని |
58,232 |
9.45x |
మంగళ |
1.8 సం. |
6 |
గురు |
Jupiter |
1,634 |
4.21 |
గురు |
69,911 |
11.2x |
గురు |
12. సం. |
7 |
శని |
Saturn |
3,315 |
8.52 |
సూర్య |
6,95,700 |
108x |
శని |
30 సం. |
పైన చూసిన పట్టిక ప్రకారం చూస్తే మనకు 7 వారాలు దూర ప్రకారం లేదా పరిమాణ లేదా గ్రహ భ్రమణ వేగం ప్రకారం, క్రింద చూపిన విధంగా రావాలి.
క్ర.సం. |
వారములు |
|||
|
దూర ప్రకారం |
పరిమాణ ప్రకారం |
భ్రమణ వేగ ప్రకారం |
|
1 |
(చంద్ర) సోమ వారం |
Monday |
(చంద్ర) సోమ వారం |
(చంద్ర) సోమ వారం |
2 |
శుక్ర వారం |
Friday |
బుధ వారం |
బుధ వారం |
3 |
మంగళ వారం |
Tuesday |
మంగళ వారం |
శుక్ర వారం |
4 |
బుధ వారం |
Wednesday |
శుక్ర వారం |
(సూర్య) ఆది వారం |
5 |
(సూర్య) ఆది వారం |
Sunday |
శని వారం |
మంగళ వారం |
6 |
గురు వారం |
Thursday |
గురు వారం |
గురు వారం |
7 |
శని వారం |
Saturday |
(సూర్య) ఆది వారం |
శని వారం |
కానీ మన వారాలు ఈ ప్రకారం ఉన్నాయి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది.
ఈ క్రమంలో ఎలా వచ్చాయో చూద్దాం.
శ్రీమద్భాగవత, స్ఖంద 3, అధ్యాం 11 లోని శ్లోకాల ప్రకారం మన కాల విభజన ఈవిధంగా ఉంది. ఒక రోజు = 1 అహో + 1 రాత్రి = 8 ప్రహారాలు = 24 గంటలు = 30 ముహూర్తాలు = 60 ఘడియలు [1]
మన పూర్వీకులు, 24 గంటలు లేదా 60 ఘడియలు ఒక గ్రహానికి కేటాయించారు.
సూర్యోదయం నుండి ఒక్కో గంటని ఒక గ్రహానికి కేటాయించారు. క్రింద చూపిన పట్టిక ప్రకారం చూస్తే, మొదటి గంట శని దగ్గర ప్రారంభిస్తే, రెండవ గంట గురుకి, 3వ గంట మంగళ గ్రహానికి కేటాయించుకుంటా వెళితే.. 24 గంటల తరువాత మళ్లా మొదటి గంట సూర్యుడికి వచ్చింది, ఆ విధంగా గంటలని ఇచ్చుకుంటా వెళితే మనకు శని —> ఆది —> సోమ —> మంగళ —> బుధ —> గురు —> శుక్ర వారాలు ఒక క్రమంలో వచ్చాయి.
రాహుకాలం
నవ గ్రహాలలో 7 గ్రహాలకి ఒక రోజు లేదా 24 గంటలు కేటాయించగా, ఛాయాగ్రహాలైన రాహు, కేతులకి ఎటువంటి రోజులు లేకుండా పోయాయి. కావున వాటికోసం, ఒక్కో గ్రహం రోజు నుండి 3 గంటలు తీసుకున్నారు. అలా 7 రోజులనుండి 3 గంటలు తీసుకుంటే 7x3 = 21 గంటలు వచ్చాయి. మిగిలినా 7 గ్రహాలు కూడా తమ తమ 24 గంటలు నుండి 3 గంటలు కోల్పోతే వాటికి కూడా 21 గంటలు మిగిలాయి. ఆ విధంగా 7 గ్రహాలకి 21 గంటలు, రాహూకేతువులకి కలిపి 21 గంటలు వచ్చాయి.
రాహుకేతువులు తమకి రోజుకి వచ్చిన 3 గంటలని సగం సగం చొప్పున పంచుకుంటే, ప్రతిరోజూ ఒక్కోక్కరికి గంటన్నర (1.5 hours) వచ్చింది.
రాహుకాలం రోజూ గంటన్నర ఈ క్రింది విధంగా ఉంటుంది. [2]
క్ర. సంఖ్య |
రాహు కాలం |
|
|
సమయం |
గ్రహం లేదా వారం |
1 |
07:30 - 09:00 |
సోమ |
2 |
09:00 - 10:30 |
శని |
3 |
10:30 - 12:00 |
శుక్ర |
4 |
12:00 - 13:30 |
బుధ |
5 |
13:30 - 15:00 |
గురు |
6 |
15:00 - 16:30 |
మంగళ |
7 |
16:30 - 18:00 |
ఆది |
యమగండం ( కేతు కాలం ?? )
కేతువుకి ఇచ్చిన గంటన్నరని మనం యమగండం గా పిలుచుకుంటున్నాం (??? నా అభిప్రాయం). ఇది కూడా రోజుకి ఇలా వస్తుంది.
క్ర. సంఖ్య |
కేతు కాలం లేదా యమగండం |
|
|
సమయం |
గ్రహం లేదా వారం |
1 |
06:00 - 07:30 |
గురు |
2 |
07:30 - 09:00 |
బుధ |
3 |
09:00 - 10:30 |
మంగళ |
4 |
10:30 - 12:00 |
సోమ |
5 |
12:00 - 13:30 |
ఆది |
6 |
13:30 - 15:00 |
శని |
7 |
15:00 - 16:30 |
శుక్ర |
రాహుకాలం + యమగండం ( కేతు కాలం ) కలిపి ఒక రోజులో
క్రమ సంఖ్య |
గ్రహం లేదా వారం |
రాహు కాలం |
కేతు కాలం, యమగండం |
1 |
సోమ |
07:30 - 09:00 |
10:30 - 12:00 |
2 |
మంగళ |
15:00 - 16:30 |
09:00 - 10:30 |
3 |
బుధ |
12:00 - 13:30 |
07:30 - 09:00 |
4 |
గురు |
13:30 - 15:00 |
06:00 - 07:30 |
5 |
శుక్ర |
10:30 - 12:00 |
15:30 - 17:00 |
6 |
శని |
09:00 - 10:30 |
13:30 - 15:00 |
7 |
ఆది |
16:30 - 18:00 |
12:00 - 13:30 |
దుర్ముహుర్తం
రోజుకి 30 ముహుర్తాలు లేదా 60 ఘడియలు ఉంటాయి. 24 గంటలు x 60 నిమిషాలు = 1,440 ని. 1,440 / 30 = 48 నిమిషాలు లేదా ఒక ముహుర్త కాలం = 2 ఘడియలు ( 1 ఘడియ = 24 నిమిషాలు )
దుర్ముహుర్తం కూడా రాహుకాలం లానే ప్రతిరోజు 48 నిమిషాలు లేదా ఒక ముహుర్త కాలం వస్తుంది. అది కూడా ఈ క్రింద చూపిన పట్టికలో మాదిరిగా వస్తుంది.
క్ర. సంఖ్య |
దుర్ముహూర్తం |
|
|
సమయం |
గ్రహం లేదా వారం |
1 |
07:30 - 08:18 |
శని |
2 |
08:00 - 08:48 |
మంగళ, శుక్ర |
3 |
09:30 - 10:18 14:30 - 15:18 |
గురు |
4 |
11:00 - 11:48 |
బుధ |
5 |
12:00 - 12:48 |
సోమ |
6 |
15:00 - 16:48 |
ఆది |
7 |
23:00 - 23:48 |
మంగళ |
వర్జ్యం
మనవాళ్లు దీనిని చెడు కాలంలా భావిస్తారు. ఇది ఆ రోజున ఉన్న నక్షత్రం ప్రకారం గుణిస్తారు. దీని సమయ కాలం 2 ముహూర్తాలు లేదా 4 ఘడియలు ఉంటుంది, అనగా 48+48 లేదా 24 + 24 + 24 +24 = 96 నిముషాలు. ఈ 96 నిమిషాలలో ఎటువంటి శుభకార్యములు చేయరు.
సూర్యోదయం ని ఉదయం 06:00 క్రింద మనం తీసుకొంటే వర్జ్యం మనకి ఈ క్రింద పట్టిక ప్రకారం వస్తుంది ( అర్ధరాత్రి 12:00 కి ఘడియ 1 ప్రారంభమై, ఘడియ 60 అర్దరాత్రి 23:59 కి ముగుస్తుంది. )
క్రమ సంఖ్య |
వర్జ్యం |
||
|
నక్షత్రం |
ఘడియల సంఖ్య |
సమయం |
1 |
అశ్విని |
51- 54 |
20:00 - 21:36 |
2 |
భరణి |
25 - 28 |
09:36 - 11:12 |
3 |
కృతిక |
31 - 34 |
12:00 - 13:36 |
4 |
రోహిణి |
41 - 44 |
16:00 - 15:36 |
5 |
మృగశిర |
15 -18 |
05:36 - 07:12 |
6 |
ఆరుద్ర |
22 - 25 |
08:24 - 10:00 |
7 |
పునర్వసు |
31 - 34 |
12:48 - 14:24 |
8 |
పుష్య |
21 - 24 |
12:00 – 13:36 |
9 |
ఆశ్లేష |
33 - 36 |
08:00 - 09:36 |
10 |
మఘ |
31- 34 |
12:00 - 13:36 |
11 |
పూర్వా ఫాల్గుణ |
21 - 24 |
08:00 - 09:36 |
12 |
ఉత్తరా ఫాల్గుణ |
19 - 22 |
07:12 - 08:48 |
13 |
హస్త |
22 - 25 |
08:24 - 10:00 |
14 |
చిత్ర |
21 - 24 |
08:00 - 09:36 |
15 |
స్వాతి |
15 - 18 |
05:36 - 07:12 |
16 |
విశాఖ |
15 - 18 |
05:36 - 07:12 |
17 |
అనూరాధ |
11 - 14 |
04:00 - 05:36 |
18 |
జేష్ఠ |
15 - 18 |
05:36 - 07:12 |
19 |
మూల |
57 - 60 |
08:24 -10:00 |
20 |
పూర్వ ఆషాడ |
25 - 28 |
09:36 - 11:12 |
21 |
ఉత్తర ఆషాడ |
21- 24 |
08:00 - 09:36 |
22 |
శ్రవణ |
11 -14 |
04:00 - 05:36 |
23 |
ధనిష్ఠ |
11 - 14 |
04:00 - 05:36 |
24 |
శతభిష |
19 - 22 |
07:12 - 08:48 |
25 |
పూర్వభద్ర |
17 - 20 |
06:24 - 08:00 |
26 |
ఉత్తరాభద్ర |
25 - 28 |
09:36 - 11:12 |
27 |
రేవతి |
31 - 34 |
12:00 - 13:36 |
గమనిక : దుర్ముహుర్తం, వర్జ్యం ఆ సమయాలకే ఖచ్చితంగా ఎందుకు పెట్టారో ఇంకా పరిశోధించి, దాని వెనక ఉన్న మర్మం ఏంటో తెలుసుకొని ఈ సమాధానాన్నినవీకరణ చేయాల్సిఉంది.
సమాప్తం
Comments
Post a Comment