ముఖ్య కారణం. క్రికెట్ క్రీడా పరిపాలన ప్రైవేటు అజమాయిషీలో ఉండటం. మిగతా క్రీడల పరిపాలన అంతా ప్రభుత్వ అజమాయిషీలో ఉండటం.
- ఒలంపిక్ క్రీడలు
- ఇతర గుర్తింపు పొందిన (నాన్-ఒలింపిక్) క్రీడలు
ప్రతి ఒలింపిక్ మరియు నాన్-ఒలింపిక్ క్రీడలకు ఒక జాతీయ క్రీడా సమాఖ్య (National Sports Federation (NSF)) ఉండి, ఆ క్రీడలను పరిపాలిస్తుంది. NSF లు మెత్తం 56 ఉన్నాయి మనకు. ఇవి అన్నీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అధ్వాన్నంగా నడుస్తాయి. అన్నీ రాజకీయనాయకుల కసుసన్నల్లో, ప్రభుత్వ అధికారుల చేతుల్లో నడుస్తాయి. అందరి లక్ష్యం ఒకటే ఉన్నన్ని రోజులు దొరికినంత దోచుకోవటం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం.
ఇంక క్రీడాభివృద్ది అంటే ఈ సమాఖ్యల్లో చాలా మందికి అర్ధం కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ఆటగాళ్లకి కసి ఉండదు, ఉద్యోగ భద్రత కావాలి అందరికి, ప్రజల ధనంతో అంతా బతికేస్తారు, ఎవరూ పైసా పెట్టుబడి పెట్టరు, ఎవరికీ జవాబుదారీతనం ఉండదు. పని చేసినా, చేయకపోయినా ప్రజల పన్నులనుండి జీతాలు, పెట్టుబడులు వస్తాయి. గెలిచినా, గెలవకపోయినా ఏమవదు, ఎవరేమనరు. వీళ్ళ కధ ఇది.
క్రికెట్
భారతీయుల అదృష్టమో, దురదృష్టమో ఒక క్రీడకి భారత ప్రభుత్వం నుండి ప్రధాన మినహాయింపు లభించింది. అదే మన క్రికెట్. NSF లేదు.
క్రికెట్ కి కొంత పోటీ ఇవ్వగలిగిన క్రీడలు హాకీ, పుట్ బాల్, టెన్నిస్, బాడ్మింటన్… ఇవి అన్నీ ప్రభుత్వ కభంద హస్తాలలో నలిగిపోతున్నాయి.
BCCI జాతీయ సంస్ధ, దీనికి అన్ని రాష్ట్రాలలో కలిపి 38 సభ్యత్వ బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డులు కూడా స్వతంత్రంగా పనిచేస్తాయి. BCCI భాధ్యత, క్రికెట్ క్రీడాభివృద్ది మరియు ధనార్జన, లాభం సంపాదించటం. రాష్ట్ర అసోసియేషన్ సభ్యత్వ రుసుము లక్షల్లో, కోట్లలో ఉంటుంది. stakes are high.
ఇప్పుడు బిసిసిఐ మరియు అధ్యక్షుడు మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించండి. వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డారు క్రికెట్ క్రీడాభివృద్దికి, 1980–90 లలో దూరదర్శన్ కి డబ్బులు కట్డి మరీప్రత్యక్ష ప్రసారం చేసి క్రీడని భారతీయుల ఇళ్లలోకి తీసుకొని వెళ్ళి మరీ క్రికెట్ ని అభివృద్ది చేసారు. ఆటగాళ్లకు మంచి జీతాలు, డబ్బు చెల్లించి, వెంటపడి మరీ స్పానర్ష్ లను తెచ్చుకున్నారు, ఉత్తమ ప్రతిభగల ఆటగాళ్లని నియమించుకున్నారు. అందరూ కలిసి అవసరమైన పెట్టుబడి పెట్టారు, వాళ్ల సొంత డబ్బు ఖర్చుపెట్టారు. ఇక్కడ అవినీతి లేదు, లక్ష్యం ఉంది, బంధుప్రీతి లేదు. కేవలం ఒకే ఒక లక్ష్యం క్రికెట్ క్రీడాభివృద్ది, పెట్టిన పెట్టుబడి మీద రాబడి. దీంతో క్రీడ అభివృద్ది చెందింది, క్రీడాకారులు బాగుపడ్డారు, ప్రజలకు నాణ్యమైన క్రీడ దొరికింది చూడటానికి.
ప్రజల ఆదరణ
ప్రజలు ఏ క్రీడలో భారత్ విజయం సాధిస్తుందో, ఆ క్రీడనే చూస్తారు, ఆస్వాదిస్తారు.క్రికెట్ కి పెట్టుబడులు ఉన్నాయి, నాణ్యమైన క్రీడాకారులు ఉన్నారు, భారత్ ని గెలిపించారు, ప్రజల మన్ననలు చూరగొన్నారు, ప్రభుత్వ క్రీడలు అన్నిచోట్లా ఓడిపోవటమే, మెల్లగా ప్రజల మన్నన, స్పాన్సర్లను కోల్పోయారు.. చివరలకి ఈ క్రీడా వ్యాపారంలో ప్రభుత్వ vs ప్రైవేటు మద్య జరిగిన జరుగుతున్న పోటీలో క్రికెట్ విజయం సాధించింది. ప్రజల ఆదరణ చూరగొన్నది.
భవిష్యత్తు చిత్రం
ఇప్పుడిప్ఫుడే మనకు, పుట్ బాల్, కబడ్డీ, బ్యాడింటన్ లలో ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయి, కాబట్టి భవిష్యత్తులో ఇని కూడా మెల్లగా ప్రేక్షకాదరణ పొంది, క్రికెట్ కి తగిన పోటీ ఇస్తాయి.
Comments
Post a Comment