సామ్యవాదం అసలైన కారణం
మనకి స్వాతంత్ర్యం వచ్చాక సామ్యవాదాన్ని (socialism) అనుసరించటం.
ప్రపంచంలో సామ్యవాదాన్ని అనుసరించి బాగుపడిన దేశం ఒక్కటి కూడా లేదు.
మనం ఉత్తర కొరియా, దక్షిణ కొరియూ లని తీసుకంటే దక్షిణ కొరియా స్వేచ్చా వాణిజ్యం (free market economy) విధానాన్ని అనుసరించి అధ్భుత ప్రగతి సాధించింది, ఉత్తర కొరియా సామ్యవాదాన్ని అనుసరించి బీదరికంలోకి జారిపోయింది.
ఇంకా తూర్పు జర్మని, పశ్చిమ జర్మని లని తీసుకుంటే పశ్చిమ జర్మని స్వేచ్చా వాణిజ్యంతో ఉన్నత స్థితికి వెళితే, తూర్పు జర్మని సామ్యవాదంతో సర్వనాశనం అయిపోయింది.
అణుబాంబులతో సర్వనాశనం అయిన జపాన్ 50 ఏళ్ళలో ధనికదేశం అయిపోయింది. వీళ్ళు కూడా స్వేచ్చా వాణిజ్య విధానంలో పైకి వచ్చారు.
ప్రస్తుతానికి వస్తే వెనిజులా దగ్గర అధ్భుతమైన ఆయిల్ నిక్షేపాలు ఉన్నా సామ్యవాదాన్ని నమ్ముకొని ఎంత ఘోరంగా నాశనం అయిపోయందో మనం చూడొచ్చు.
సోవియట్ యూనియన్, తూర్పు ఐరోపా దేశాలు, చైనా (1978 వరకు) ఆర్ధికంగా దిగజారిపోయాయి ఈ సామ్యవాద మత్తులో పడి.
మొత్తానికి ఆర్ధిక స్వేచ్చ లేని, సామ్యవాదాన్ని మాత్రమే నమ్ముకొని బాగుపడిన దేశం కానీ, సమాజం కానీ, ఒక జాతి కానీ లేవు ఈ భూమ్మీద.
మన భారతదేశానికి వస్తే, స్వాతంత్ర్యం సిద్దించాక, మన నాయకులు సామ్యవాద ఆర్దిక విధానం అనుసరించారు 1991 వరకు. మహానుభావుడు పి.వి.నరసింహారావు గారు వచ్చి మనల్ని స్వేచ్చా వాణిజ్యం వైపు దారి మళ్లించి భారతజాతిని రక్షించాడు.
1947 - 1991 మన తలసరి ఆదాయం 1.3% చొప్పున మాత్రమే అభివృద్ధి చెందింది. దీన్నే ప్రపంచదేశాలు హిందూ వృద్దిరేటు[1] అని ఎగతాళి చేసేవారు.
1991 వరకు మనం ప్రైవేటు పెట్టుబడులను నిరుత్సాహపరిచే వాళ్ళం, విదేశీ పెట్టుబడులకు తలుపులు మూసివేశాం. లాభం సంపాదించాలి అంటే పాపంలా చూసేవాళ్ళం. సర్వం ప్రభుత్వమయం. వ్యనస్తలో పోటీతత్వం అనేదీ లేదు మనకు, అంతా సహకారమే, చివరకు ఉత్పత్తి శూన్యం.
చైనా 1978 లో మావో మరణించాక, డెంగ్ జియోపింగ్ (deng xioping) నాయకత్వంలో స్వేచ్చా వాణిజ్యపద్దతికి మారి అధ్భుత ప్రగతిపదంలో దూసుకొని పోతోంది. మనం 1991 లో దారి మార్చాం. 13 ఏళ్ళ అంతరం ఉంది రెండు దేశాల మధ్య. ఆ తేడా ఇంకా కొనసాగుతుంది ఈ రోజుకి కూడా.
1978 లో చైనా, భారత్ GDP సమానం, 2020 లో భారత్ 3 ట్రిలియన్లు ఉంటే చైనా 15 ట్రిలియన్లు. 5 రెట్లు పెద్దది.
13 ఏళ్ళ క్రితం (2007) లో చైనా ఆర్ధిక శక్తి 3 ట్రిలియన్లు. 13 ఏళ్ళ క్రితం చైనా ఎక్కడ ఉందో మనం ఇప్పుడు 2020 లో సేమ్ పొజిషన్లో ఉన్నాం.
ధనం రెట్టింపు అవడానికి సాదారణంగా 6 నుండి 7 ఏళ్ళు పడుతుంది. 3 నుండి 6 అవటానికి 6 ఏళ్ళు, 6 నుండి 12 అవటానికి ఇంకో 6 ఏళ్ళు మొత్తం 12 ఏళ్ళలో మన భారతం 12 ట్రిలియన్లు, 2040 వచ్చేసరికి దగ్గర దగ్గరగా 40–50 ట్రిలియన్లకి చేరుకొని ప్రపంచంలో రెండవ స్థానానికి చేరుకొన తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది.
చరిత్రలోకి చూస్తే ఏ సమయంలో అయినా, ప్రపంచం మొత్తం మీద చూస్తే 25% జనాభా మరియు సంపద మన భారత దేశంలోనే ఉండేది. ఈ రోజున కూడా ప్రపంచంలో వ్యవసాయ భూమి పరంగా (Aerable Land)[2] మనమే అతి పెద్ద దేశం, అధ్భుతమైన భూమి, ఖనిజ సంపద, మేధస్సు, విఙ్నానం మన సొంతం.
2020 లో జనాభా 25% జనాభా మనదే. సంపద మాత్రం 3%. మనం తొందరలో మళ్లా 25% సంపదకి చేరుకుంటాం, మళ్లా ధనికదేశం అవుతాం. సందేహం లేదు.
Comments
Post a Comment