Skip to main content

Posts

Showing posts from May, 2021

అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించడం లేదు ?

  కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఒక సంవత్సరానికి సుమారుగా 30 లక్షల కోట్లు లేదా 30 శంఖులు (ఒక శంఖు शङ्कु అంటే 1 లక్ష కోట్లు. 10 పవర్ 12). ఖర్చు 33 లక్షల కోట్లు లేదా శంఖులు (10% fiscal deficit లేదా లోటు బడ్జెట్ మనది). పెట్రోలియం మీద కేంద్రానికి 3 శంఖుల ఆదాయం సంవత్సరానికి. 6 శంఖులు కార్పోరేట్ ఆదాయ పన్నులు, 6 శంఖులు వ్యక్తిగత ఆదాయ పన్నులు, 7 శంఖుల GST, 1.5 శంఖులు కస్టమ్స్, మిగతావి అప్పులు, ఇతరత్రా ఆదాయం. మొత్తం సుమారుగా 30 శంఖులు. పెట్రోలియం మీద సుంకాలు తగ్గించాలంటే… మనకు 30 శంఖుల ఆదాయం. 35 శంఖుల ఖర్చులు. ఒకటి ఆదాయం పెంచుకోవాలి లేదా ఖర్చులు తగ్గించుకోవాలి. కేంద్ర ఉద్యోగాలలో కోతలు పెట్టాలి, సబ్సిడీలు తగ్గించాలి, రైతులు MSP లు తీసివేయాలి, విద్య, వైద్యం, రోడ్లు, నీళ్ళు లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో కోత పెట్టాలి. కార్పోరేట్ ఆదాయ పన్నులు -  ఇక్కడ పన్నులను పెంచితే, లాభాలు పడిపోయి, కంపెనీలు పారిపోతాయు లేదా ఉద్యోగాలు తొలగిస్తాయి. వ్యక్తిగత ఆదాయ పన్నులు  - నూటికి కట్టేదే ఐదుగురు. 5%. వీళ్ళనే మళ్ళా ఏం పిండుతాం ? మధ్య తరగతి పాపం. లేదా  GST  పెంచాలి. ఉప్పు మీద, పప్పు మీద పన్ను వేసారు అన...

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎంత వరకు సమంజసం ? ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ను ప్రైవేట్ పరం చేస్తుందా ?

విశాఖ స్టీల్ ను ప్రైవేటు చేయడానికి మోడీ ప్రభుత్వ ప్రయత్నం. దీనిని మనమందరం ఓపెన్ హార్ట్ తో స్వాగతం పలకాలి, ఎందుకంటే ఇది చాలా మంచి చర్య. ఎందుకంటే ముందర ఒక సాధారణ ప్రభుత్వ సంస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం ? సంస్ధ యజమాని ఎవరు? సంబంధిత మంత్రి. ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఎవరు కంపెనీ నడుపుతున్నారు ? కొందరు ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు.వీళ్ళకు వ్యాపారనుభవం సున్న. ఇక ప్రభుత్వ ఉద్యోగులు: ఉద్యోగం పోతుందనే భయం లేదు, కంపెనీకి నష్టాలొచ్చినా వీళ్ళ జీతాలకు ఢోకాలేదు. పదవీవిరమణ వరకు జీతం గారెంటీ, ఒక్కసారి ఉద్యోగం తెచ్చుకుంటే పని చేసినా చేయకపోయినా జీవితాంతం జీతం. కంపెనీకి నష్టాలు వస్తే డబ్బు ఎవరు చెల్లిస్తారు? మన పన్నుల నుండే.ప్రజలు కష్టం నుండి. ఒక మంత్రి, కొద్దిమంది ఐఏఎస్ లు మరియు కొంతమంది అదృష్టవంతమైన ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగం ఎలా వస్తుంది? మనలో చాలామందికి తెలుసు. ఎలా గవర్నమెంట్ జాబ్ పొందాలో, ఎంత ఖర్చు అవుతుందో, అవినీతికి మూలస్తంభం) పైన ఉదహరించిన వాళ్ళలో ఎవరైనా కంపెనీలో సింగిల్ పైసా పెట్టుబడి పెట్టారా ? ప్రజల పన్నుల డబ్బు మాత్రమే ఉంది అక్కడ. ఒకవేళ నష్టం వస్తే మంత్రి, మేనేజ్ మెంట్ లేదా ఉద్యోగులకు ఏమై...